2 Corinthians 9
పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీపేర వ్రాయుటకు నాకగత్యము లేదు.
"మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి యున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియ వారి యెదుట అతిశయ పడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి."
అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్ధము కాకుండునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని.
"మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియ వారెవరైనను నాతో కూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన యెడల ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేల ?"
"కావున లోగ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని."
"కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును."
సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
"మరియు అన్నిటియందు ఎల్లప్పుడును, మీలో మీరు సర్వ సమృద్ధిగలవారై, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు."
"ఇందువిషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి యున్నది."
"విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గల వారగునట్లు, మీ నీతి ఫలమును వృద్ధిపొందించును."
ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రమే కాకుండ అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.
"ఏలాగనగా, క్రీస్తు సువార్త అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ పరచుచున్నారు."
"మరియు మీ యెడల దేవుడు కనబరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారైయున్నారు."
చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.